Thursday, October 22, 2026

 మేఘంలో నిదురిస్తున్న నీటి బొట్తుని మెల్కొల్పి తొలకరి జల్లుని కురిపించిందేవరు?
తొలకరి జల్లుకు మొలకెత్తిన మొక్కకి పచ్చదనమనే రంగును పూసిందెవరు?
ప్రకృతి గర్జనకు ప్రతిరూపమైన పిడుగు కి ఆ శక్తిని అందించిన్ దెవరు?
పిడుగు ప్రతిఫలమైన మెరుపుకి ఆ కాంతినందించిన్ దెవరు?
తన కాంతి పుంజాలతో చీకటీనీ తరిమెసే భానుడికి జ్వాల నందించిన్ దెవరు?
సముద్ర గర్భంలో దాగున్న ముత్యానికి గుండ్రటి రూపాన్నదించిన్ దెవరు?
పరవళ్ళు తొక్కుతున్న నది వరవడికి తొలి చినుకునందించిన్ దెవరు?
ఘనీభ వించిన నీటికి తెల్లదనాన్ని ఆపాదించిన్ దెవరు?
తెల్లని మల్లెకు సుగంధం వెదజల్లే పరిమళాన్నిచిన్ దెవరు?
ఎవరు.....ఎవరు.....ఎవరు.....అని అన్వేషించే ఓ ప్రకృతి పిపాసి...!!

No comments:

Post a Comment